Venkatesh1

Jan 31 2024, 07:27

నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన మైఖోం నిదియా దేవి ఐ.ఎ.యస్ గారిని జిల్లా ఎంపీపీల సంఘం తరఫున మర్యాదపూర్వకంగా కలసిన బుక్కరాయసముద్రం ఎంపీపీ దాసరి సునీత
ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారిణిగా నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీమతి మైఖోం నిదియా దేవి ఐ.ఎ.యస్ గారిని జిల్లా ఎంపీపీల సంఘం తరఫున మర్యాదపూర్వకంగా కలసిన బుక్కరాయసముద్రం ఎంపీపీ దాసరి సునీత గారు మరియు కూడేరు ఎంపీపీ నారాయణ రెడ్డి గారు

Venkatesh1

Jan 31 2024, 07:20

జగనన్న మాట శిరోధార్యం - సమన్వయంతో పని చేద్దాం..నా తమ్ముడు వీరాంజనేయులును గెలిపించుకుందాం: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
జగనన్న మాట శిరోధార్యం - సమన్వయంతో పని చేద్దాం..నా తమ్ముడు వీరాంజనేయులును గెలిపించుకుందాం: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. - సామాన్య కార్యకర్తను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టే దమ్ము కేవలం జగనన్నకే ఉంది - జగనన్నకు, ఎమ్మెల్యే దంపతులకు రుణపడి ఉంటాను - నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తాను: వీరాంజనేయులు సామాజిక సమీకరణలో భాగంగా జగనన్న నిలబెట్టిన అభ్యర్థిని సమన్వయంతో కలిసికట్టుగా మనమందరం పనిచేసి గెలిపించుకుందామని వైస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పిలుపునిచ్చారు. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు కుటుంబం వైఎస్ఆర్సీపీ తరఫున సర్పంచ్ గా ఎన్నికై అక్కడ ప్రజలకు, పార్టీకి సేవలందించారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటకు కట్టుబడి నా తమ్ముడు వీరాంజనేయులును వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆశీర్వదించాలన్నారు. టిక్కెట్ తనకు ఇచ్చినా ఇవ్వకపోయినా జగనన్న మాటకు కట్టుబడి జగనన్న చేస్తున్న అభివృద్ధిని మరింత బలోపేతం చేయడానికి మాపైన మోపిన నమ్మకాన్ని మేము నిర్వర్తించి వైఎస్ఆర్సీపీ జెండాని నియోజకవర్గంలో ఎగరేస్తామన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచాను, పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. గతంలో జగనన్న పేదల పక్షాన నిలబడినందుకు కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులకు గురిచేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో కలహాలు నింపడానికి తన సొంత చెల్లెలైన షర్మిలను కూడా కాంగ్రెస్ వైపు తిప్పుకొని కుటుంబంలో చిచ్చు పెట్టారన్నారు. వైయస్ షర్మిలమ్మ కూడా జగనన్న గొప్పతనాన్ని తెలుసుకొని ఎప్పటికైనా తన చెంతకు వస్తుందన్నారు. తన సొంత చెల్లెలు జగనన్న వైపు లేకపోయి ఉండొచ్చు, ఆంద్రప్రదేశ్ లోని ప్రతి అక్క చెల్లెమ్మలు జగనన్నను అన్న, తమ్ముడిగా భావిస్తూ తన వెంట ఉన్నారన్నారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గతంలో నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు అదేవిధంగా వీరాంజనేయులు కూడా ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు విభాగం అధ్యక్షులు యన్.వి నారాయణ, మండల కన్వీనర్ అంకె నరేష్ , ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ నాయక్,మండల కన్వీనర్ వరకూటి కాటమయ్య, గంగరాజు, రామచంద్ర, నాగలింగా తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Jan 30 2024, 19:01

Flash..Flash..బైక్ ఆక్సిడెంట్ ఓ మహిళ మృతి..

నార్పల మహిళ మార్ట్ దగ్గరా రోడ్డు దాటుతుండగా మహిళ బైక్ ఆక్సిడెంట్ జరిగి మహిళా చనిపోవడం జరిగింది. సాయంత్రము బైక్ యాక్సిడెంట్ వల్ల ఒక మహిళ చనిపోవడం జరిగింది... అబ్బాయి వయస్సు 20 సంవత్సరాలు ఉండవచ్చని అంచనా ఎక్కువ అతివేగం వెళ్లడం వల్ల యాక్సిడెంట్ జరగడం జరిగింది.. చనిపోయిన మహిళ పేరు రామలక్ష్మమ్మ..

Venkatesh1

Jan 30 2024, 15:59

జగనన్న సంక్షేమ పథకాలే.. విజయానికి సోపానాలు: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

జగనన్న సంక్షేమ పథకాలే.. విజయానికి సోపానాలు: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

◆ పాల్గొన్న సమన్వయకర్త యం. వీరాంజనేయులు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు వైఎస్సార్సీపీ విజయానికి సోపానాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.

పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామంలో డా.వైయస్సార్ రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ విలేజ్ క్లినిక్, అలాగే ఎల్లుట్ల గ్రామంలో గ్రామ సచివాలయం, డా.వైయస్సార్ రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ విలేజ్ క్లినిక్ ల నూతన భవనాలను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రారంభించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ...గత టిడిపి ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని, అప్పట్లో ఏవైనా పథకాలు వర్తించాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉండేదని, వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చరిత్రలో లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమం, అభివృద్ధి అందించామన్నారు. జగనన్న పాలనను చూసి ఓటమి భయంతో ప్రతిపక్షాలు కూటములుగా వస్తున్నాయని, వాటిని తిప్పికొడుతూ రాబోయే ఎన్నికలలో జగనన్నని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని కోరారు.

ఈ కార్యక్రమంలో చైర్మన్, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.